మత్తు కోసం శానిటైజర్ తాగి కుస్తీ క్రీడాకారుడు మృతి - MicTv.in - Telugu News
mictv telugu

మత్తు కోసం శానిటైజర్ తాగి కుస్తీ క్రీడాకారుడు మృతి

October 21, 2020

Wrestler Drinking Sanitizer

లాక్‌డౌన్ సమయంలో చాలా మంది మత్తు కోసం శానిటైజర్లను కూడా వదలలేదు. ఎలాగైనా మత్తు రావాలని వాటిని తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వాటిలో ఉండే గాఢమైన రసాయనాలు శరీరానికి చేటు చేస్తాయని నిపుణులు కూడా చెప్పారు. మద్యానికి బానిసైన వారు ఈ పని చేశారు. కానీ తాజాగా ఓ కుస్తీ వీరుడు కూడా శానిటైజర్ తాగాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది అనేకసార్లు బంగారు పతకాలను గెలుచుకున్న అతడు దాన్ని తాగి ప్రాణాలు కోల్పోయాడు. నాలాగఢ్‌లోని సైజీ‌మరాజ్‌లో ఇది చోటు చేసుకుంది. 

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అజయ్ ఠాకూర్ జాతీయ కుస్తీ పోటీల్లో ఎన్నోసార్లు బంగారు పతకాన్ని సాధించారు. సైన్యంలో సుబేదారుగా మూడేళ్లపాటు తన సేవలను అందించారు. ఉద్యోగం మానేసి తిరిగి ఇంటికి వచ్చేశాడు. గ్రామంలోని యువకులకు కుస్తీ నేర్పించడం ప్రారంభించారు. 11 నెలల క్రితం దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. తిరిగి వచ్చిన తర్వాత తాగుడుకు బానిసగా మారాడు. ఈ క్రమంలో  రెండు రోజులుగా శానిటైజర్ తాగడం కూడా ప్రారంభించాడు. ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కానీ పరిస్థితి విషమించి చనిపోయాడు.