కుస్తీలో మెడ విరిగి చనిపోయాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

కుస్తీలో మెడ విరిగి చనిపోయాడు..

April 6, 2018

మల్లయుద్ధంలో పట్టు తప్పితే ప్రాణాంతకం. మహారాష్ట్రలో అలాంటి విషాదం చోటుచేసుకుంది. ప్రత్యర్థి  బిగించిన పట్టును విడింపించుకునే క్రమంలో కిందపడి మెడ విరిగి తీవ్రంగా గాయపడిన నీలేశ్ కందుర్కర్ (20) అనే రెజ్లర్ శుక్రవారం చికిత్స పొందుతూ చనిపోయాడు. కోల్హాపూర్‌లో ఈ విషాదం  చోటుచేసుకుంది. 

జ్యోతిబా జాతర సందర్భంగా సోమవారం బండివేడ్‌ ప్రాంతంలో కుస్తీ పోటీలు జరిగాయి. తొలి బౌట్‌లోనే నీలేశ్‌కు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యాడు. అతడు నీలేశ్‌ను పట్టుకుని విసిరేయయాడు. పట్టును తప్పించుకునే క్రమంలో నీలేశ్ దబ్బున కిందపడ్డాడు. బరువు పూర్తిగా మెడపైనే పడ్డంతో అది విరిగిపోయింది. ప్రత్యర్థి సంబరాలు చేసుకున్నాడు. అయితే నీలేశ్ చాలాసేపటి వరకు లేవకపోవడంతో అతణ్ని హుటాహుటిన కొల్హాపూర్‌లోని మెట్రో హాస్పిటల్‌కు తరలించి, ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం కరాడ్‌లోని కృష్ణ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పనిచేయకపోవడంతో నీలేశ్ చనిపోయాడు.