Write it down..that day India will shake: Vijay
mictv telugu

రాసి పెట్టుకోండి..ఆరోజు ఇండియా షేక్ అవుతుంది: విజయ్

July 21, 2022

”రాసి పెట్టుకోండి ఆగస్టు 25న ఇండియా మొత్తం షేక్ అవుతుంది” అని టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అన్నారు. గురువారం ఉదయం ‘లైగర్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అనంతరం విజయ్ మాట్లాడుతూ..”అరేయ్ అందరికి వినిపిస్తుందరా అసలు మీకూ, నీ యమ్మా ఏందిరా ఈ మెంటల్ మాస్. నాకు ఈరోజు అస్సలు అర్థం కావట్లేదు మీ అందర్నీ చూస్తుంటే. మీకూ నా అయ్యా తెల్వదు, మా తాత తెల్వదు. రేండేళ్లు అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి, అది కూడా అంత పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు. అయినా, ఈరోజు ట్రైలర్‌కు మీ నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ చిత్రాన్ని మీకే అంకితం చేస్తున్నా. మీకోసమే సినిమాలో ఆ బాడీ ట్రై చేశా. డ్యాన్సులంటే నాకు చిరాకు. కానీ, మీ కోసమే చేశా. మీరందరూ గర్వంగా ఫీలవ్వాలనే అంత కష్టపడ్డా. ఆగస్టు 25న థియేటర్లు అన్నీ నిండిపోవాలి. రాసి పెట్టుకోండి ఆరోజు ఇండియా షేక్ అవుతుంది” అని అన్నారు.

అనంతరం దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. “నేను ‘లైగర్’ గురించి చెప్పడం లేదు. కేవలం విజయ్ గురించే చెబుతున్నా. సినిమా పరిశ్రమలో విజయ్ దేవరకొండ పేరు గొప్పగా వినిపిస్తది. ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ మాకెంతో అండగా నిలిచారు. ఆయన్ని ఇక్కడికి పిలిచింది. ట్రైలర్ చూపించడానికి కాదు. సినిమాపై మన తెలుగువాళ్లకు ఉన్న ప్రేమను చూపించడానికి. ఆగస్టు 25న అదరగొట్టేద్దాం” అని అన్నారు. ఇక, థియేటర్‌లో అభిమానుల సందడి చూసిన నటి అనన్య ఆశ్చర్యపోయారు. తెలుగువారి ప్రేమను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు.