writer chandrabose reaction on waltair veerayya title song lyrics controversy
mictv telugu

వీరయ్య శివదూషణ వివాదం.. ఎట్టకేలకు చంద్రబోస్ వివరణ..!

December 29, 2022

మొన్న విడుదలైన మెగాస్టార్ వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లో పరమశివుడిని గుడ్డికన్నోడా అంటూ సంబోదించారని.. శివదూషణ జరిగిందని సోషల్ మీడియాలో కాంట్రవర్సీ ఒక క్రియేట్ అయింది. అయితే యండమూరి వీరేంద్రనాథ్ ఈ పదునైన విమర్శలు చేసి రచ్చకి తెరలేపాడు. ఎప్పటి నుండో మెగా కాంపౌండ్ కి దెగ్గర వ్యక్తి అయినా ఈ మధ్య కాస్త దూరమయ్యాడు యండమూరి. అయితే తాజాగా తన ఫెస్ బుక్ పేజ్ లో వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ రాసిన చంద్రబోస్ ని తెగ ఆడుకున్నాడు యండమూరి. ‘భగ భగ భగ అంటూ సాగే టైటిల్ సాంగ్ లో.. ‘పరమశివుడిని తిమిరనేత్రమై వరించిన త్రినేత్రేడే అంటూ వాల్తేరు వీరయ్యలో పదాలని వాడారని.. చంద్రబోస్ కి ఏ సప్రదాయం తెలుసు.. ఏ పురాణ కథలు చదివాడు? తిమిరనేత్రము అనగా చీకటి కన్నుగా కలిగినవాడు, గుడ్డివాడు లేదా రోగమున్న కన్నుకలవాడు ! ఏ అర్ధం తీసుకున్నా అది శివదూషణే అవుతుంది’ అంటూ బోస్ పై యండమూరి ధ్వజమెత్తాడు.

ఇక ఈ పోస్టుకి నెటిజన్స్ సైతం మద్దత్తు తెలపటంతో ఒక్కసారిగా వైరల్ అయింది. భారతదేశ సాహిత్య చరిత్రలో శివుడిని ఎవడు ఇంతలా తిట్టలేదంటూ పెద్దఎత్తున నెటిజన్స్ ఫైర్ అవుతుండటంతో ఎట్టకేలకు రైటర్ చంద్రబోస్ స్పందించాడు. అయితే తాను ఎక్కడా శివదూషణ చేయలేదని సంప్రదాయ కవితంలో ఉన్న విరోధాభాసం అనే అలంకారాన్ని వాడడంతో పాటు అందమైన అనేక పద ప్రయోగాలతో పాటను ఏర్చి కూర్చాను అని చంద్రబోస్ చెప్పుకొచ్చారు. అలంకారాన్ని అర్ధాన్ని చూడాలని ఆయన కోరుతున్నారు.తిమిర నేత్రమై అవరించిన త్రినేత్రుడు అని రాసిన పదాలపై మాట్లాడుతూ.. శివుడికి మూడు కళ్ళు ఉన్నాయి. ఆయన త్రినేత్రుడు అందువల్ల ఆయన శతృవుకు చీకట్లు కమ్మెలా చేస్తాడు కానీ తాను మాత్రం మూడు నేత్రాలతోనూ ప్రతాపం చూపిస్తారు అని చెప్పడమే తన ఉద్దేశ్యమని అన్నారు. మూడు కళ్లున్న వ్యక్తి. త్రినేత్రుడు తిమిర నేత్రుడు.. చీకటి కన్నుల వెళ్లి ఆవరించేస్తాడు. దీంతో శత్రువుకి అంథకారమైపోతుంది అని అర్థం అంటూ వివరించాడు చంద్రబోస్.

ఇవి కూడా చదవండి :

ఇండస్ట్రీ పెద్దరికంపై మరోసారి చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

అర్ధం పర్ధం లేకుండా ఉంది.

రాధిక నుంచి నాగలక్ష్మి వరకు…. 2022 రౌండప్

మరో వివాదంలో రష్మిక.. సౌత్ ఇండస్ట్రీపై వెగటు కామెంట్స్

ఎర్రి వెధవలని చేసి.. ఏం తేలినట్టు నటించటం ఏంటక్కా ?

జేడీ అప్‌సెట్ అయ్యాడు.. అందుకే నా పెళ్ళికి రాలేదు..!

నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం