ప్రముఖ గేయ రచయిత, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ పదవి వరించింది. ఆయనతోపాటు కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డిలను ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ పదవులకు సీఎం కేసీఆర్ నామినేట్ చేశారు. వీరు ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాలని సమాచారం అందించారు. ఈమేరకు తగిన ఏర్పాట్లు చేయాలని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిలను సీఎం ఆదేశించారు. గవర్నర్ కోటాలో ఎన్నుకోవాల్సిన మరో ఇద్దరి పేర్లను రేపోమాపో వెల్లడించే అవకాశం ఉంది. దేశపతి శ్రీనివాస్ ప్రస్తుతం సీఎం కార్యాలయంలో ఎఎస్డీగా పనిచేస్తున్నారు. కుర్మయ్య ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడంతో మళ్లీ నామినేట్ చేశారు. 2019లో ఆయన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ అయ్యారు. చల్లా వెంకట్రామిరెడ్డి 2004లో అలంపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు.