wrong with your blow dry for hair
mictv telugu

తలస్నానం తర్వాత ఇలా చేయకూడదు!

November 18, 2022

Hair, dry, moisture, mistakes, brushing, hair

ఆడవాళ్లు, మగవాళ్లనే తేడా లేదు.. సెలూన్కి వెళ్లి జుట్టు అప్పగించేస్తున్నారు. వాళ్లే కడిగేసి, ఆరబెట్టి నీట్గా తయారు చేస్తున్నారు. కానీ అదే లుక్ ఇంటి దగ్గర ప్రయత్నిస్తే మాత్రం ఇద్దరికీ చుక్కెదురే! ప్రతీసారి సెలూన్కి వెళ్లి డబ్బులను అలా సమర్పించుకోవడం కంటే కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు ఊడకుండా, అలాగే మృదువైన జుట్టు మీ సొంతం అవుతుంది.
_ తలస్నానం చేసి రాగానే డ్రయర్ తీసుకొని జుట్టును ఆరబెట్టడం మొదలుపెడుతుంటారు. మొదట చేసే తప్పు అదే. జుట్టులోని నీరు మొత్తం కారడం ఆగేవరకు డ్రయర్ ఆన్ చేయడానికి వీల్లేదు. టవల్తో జుట్టును గట్టిగా కట్టి కాసేపు వదిలేయాలి. అప్పుడే జుట్టులోని తేమ చాలావరకు తగ్గిపోతుంది.

‌‌_ ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే.. తలస్నానం చేసి రాగానే జుట్టు దువ్వడం. ఈ పని అస్సలు చేయకూడదు. దీనివల్ల జుట్టు చిట్లిపోవడం, మరింత డ్యామెజీ అవ్వడం జరుగుతుంది. జుట్టు ఆరిన తర్వాతే ముందుగా పెద్ద పండ్ల దువ్వెనతో మాత్రమే జుట్టును దువ్వాలి. గుండ్రటి దువ్వెనతో అస్సలు దువ్వకూడదు.‌‌‌‌_ ఒకప్పుడు బొగ్గుల్లో సాంబ్రాణి వేసి ఆ వేడితో జుట్టును ఆరబెట్టేవారు. అది మంచి పద్ధతంటున్నారు ఫ్యాషన్ పండితులు. అంతేకాదు.. ఎండలో కాసేపు నిలబడితే జుట్టు మామూలుగానే ఆరిపోతుంది. అలా చేస్తే జుట్టు రాలడం సమస్య కూడా చాలా వరకు నివారించవచ్చట. ఇలా సహజంగా కొద్దిమేర జుట్టు ఆరిన తర్వాతే డ్రయర్లను వాడాలి._ చాలామంది డ్రయర్లను తప్పుగా వాడుతుంటారు. జుట్టు చివర భాగం నుంచి పైన ఆరబెడుతుంటారు. కానీ ఎప్పుడు జుట్టు మొదళ్ల నుంచి చివరలను ఆరబెట్టాలి. అప్పుడే జుట్టు చిట్లిపోదు. అంతేకాదు.. జుట్టు కూడా పట్టుకుచ్చులా మారుతుంది.

wrong with your blow dry for hair

క్వాలిటీ ఉన్నడ్రయర్లను మాత్రమే ఉపయోగించడం మరవద్దు. మంచి క్వాలిటీ ఉన్న డ్రయర్ జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. అందులో వేడిని కూడా తక్కువ, ఎక్కువ చేసుకొనే సెట్టింగ్స్ ఉంటాయి. కొంతమంది డ్రయర్ ముందు భాగంలో ఉండే నాజల్ని అటాచ్ చేయరు. కానీ దాన్ని కలపడం వల్ల జుట్టు డ్యామేజీని సగం మేర తగ్గించవచ్చనేది చాలామందికి తెలియదు.