Home > Corona Updates > వుహాన్‌‌లో మళ్లీ కరోనా భయం.. 30 లక్షల మందికి టెస్టులు

వుహాన్‌‌లో మళ్లీ కరోనా భయం.. 30 లక్షల మందికి టెస్టులు

Wuhan

చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గడగడలాడిస్తోంది. అక్కడ పూర్తిగా తగ్గుముఖం పట్టిందనుకున్న సమయంలో మళ్లీ వుహాన్‌లో కరోనా కేసులు నమోదవడంతో కలకలం రేగింది. దీంతో వుహాన్ అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయింది. ఈ క్రమంలో వూహాన్‌లో 30 లక్షల మందికి పైగా ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది.

వూహాన్‌లోని మొత్తం 1.1 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందరికీ 10 రోజుల్లో పరీక్షలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా ఇప్పటికే 30 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.

Updated : 15 May 2020 10:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top