కోవిడ్, కరోనా.. పేరు ఒకటే. కానీ రూపాలు కోకొల్లలు. కోవిడ్ వైరస్ వేరియంట్లతో ప్రపంచం గడగడ వణుకుతోంది. మనదేశంతోపాటు చైనా, బ్రిటన్, అమెరికా తదితర దేశాల్లో కొత్తకొత్త వేరియంట్లు వేగంగా వ్యాప్తిస్తున్నాయి. వీటిలో ఒమిక్రామ్ వేరియంట్లోని సబ్ వేరియంట్లే అధికం. వీటిలో ఒకటైన కొత్తరకం ఎక్స్‌బీబీ 1.5 (XBB.1.5) వేరియంట్ బ్రిటన్‌లో తీవ్రంగా వ్యాపిస్తోంది. ప్రతి 25 కోవిడ్ కేసుల్లో ఒకటి ఈ వేరియంటే. దీనికారణంగా చాలా మంది ఆస్పత్రులకు చేరుతున్నారు. ఎక్స్‌బీబీ 1.5 మిగతా వేరియంట్లకంటే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మ్యుటేషన్ రోగనిరోధక శక్తిని దారుణంగా దెబ్బతిస్తుంది. ఇదివరకు వ్యాక్సీన్లు తీసుకున్నవారినీ వదలిపెట్టదు. వయోవృద్ధుల్లో ఈ వేరియంట్ చాలా సమస్యలు సృష్టిస్తుందని వార్విక్ వర్సిటీకి చెందిన లారెన్స్ యాంగ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో నమోదవుతున్న ప్రతి 10 కోవిడ్ కేసుల్లో నాలుగు ఈ వేరియంటువే. బీఏ.5, బీఏ.2, బీ.1.1.529, ఎక్స్‌బీబీ వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. మనదేశంలో తొలి XBB.1.5 కేసు గుజరాత్ లో నమోదైంది.
ఇవి కూడా చదవండి :
ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ కు మరోసారి చుక్కెదురు
గూగుల్ లో వీటిని సెర్చ్ చేస్తే జైలు జీవితం ఖాయం
యూట్యూబ్ వీడియోస్‌తో రూ.40 లక్షల అప్పు తీర్చేశాడు