70 అంగుళాల రెడ్‌మీ టీవీ.. ధర తక్కువే! - MicTv.in - Telugu News
mictv telugu

70 అంగుళాల రెడ్‌మీ టీవీ.. ధర తక్కువే!

August 29, 2019

Redmi Tv...

స్మార్ట్ ఫోన్ ఉత్పత్తుల్లో సరికొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న ‘షావోమి’ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది.రెడ్‌మీ బ్రాండ్ పేరుతో తొలి స్మార్ట్ టీవీని విడుదల చేసింది. బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సరికొత్త టీవీని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ‘ఎంఐ’ బ్రాండ్‌తో స్మార్ట్ టీవీలను విడుదల చేసిన షావోమి.. ఇప్పుడు సరికొత్తగా రెడ్‌మి సిరీస్‌తో త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. 

70 అంగుళాల స్క్రీన్ ఉన్న ఈ టీవీలో అనేక ఫీచర్స్‌ను పొందుపరిచింది. 2జీ ర్యామ్‌, 16జీబీ మెమోరీ, డాల్బీ ఆడియో సిస్టమ్‌తో ఇది పనిచేయనుంది. 4కే రిజల్యూషన్ స్క్రీన్, క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 3 నుంచి చైనా మార్కెట్లలో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. వీటి ధర 3,799 యువాన్లు ( రూ. 38 వేలు)గా నిర్ణయించారు. అయితే భారత మార్కెట్లోకి ఈ సరికొత్త టీవీ ఎప్పుడు రాబోతుందనే విషయం మాత్రం షాయోమి సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని మాత్రం మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ రంగంలో పలు ఉత్పత్తుల్లో దూసుకెళ్తున్న షావోమికి మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే.

tt