39 అంగుళాల ఎల్ఈడీ టీవీ.. 13 వేలకే.. - MicTv.in - Telugu News
mictv telugu

39 అంగుళాల ఎల్ఈడీ టీవీ.. 13 వేలకే..

March 14, 2019

ఇన్నాళ్లు మన దేశంలోని మొబైల్ మార్కెట్‌లోకి మాత్రమే వచ్చిన చైనీస్ కంపెనీలు..  ఇప్పుడు టెలివిజన్ మార్కెట్‌లోకి దూసుకొచ్చేస్తున్నాయి. తాజాగా మొబైల్ మేకర్ షియోమీ ఎంఐ టీవీ 4 సిరీస్ టీవీలను అతి తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చి సంచలన సృష్టిస్తోంది. షింకో తక్కువ ధరకే పెద్ద ఎల్‌ఈడీ టీవీలను అందిస్తోంది. ఎస్‌ఓ‌4ఎ 39 అంగుళాల ఎల్‌ఈడీ టీవీని మార్కెట్లోకి తీసుకొచ్చి, రూ.13.990 లకే వినియోగదారులకు అందజేస్తోంది.

దీని ప్రత్యేకతలు ఏంటంటే?

ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, హెచ్‌డీ రిజల్యూషన్ ఉంది. 4కె ప్లేబ్యాక్‌కు సపోర్టు చేస్తుంది. యూఎస్‌బీ టు యూఎస్‌బీ ఫైల్ ట్రాన్స్‌ఫర్, 20 వాట్స్ స్పీకర్, ఎనర్జీ సేవింగ్‌తో పాటు సర్వీసింగ్, ఇన్‌స్టాలేషన్, మరమ్మతుల వంటివాటి కోసం ఆండ్రాయిడ్ యాప్‌‌ను కూడా షింకో అందుబాటులోకి ఉంచింది.