షియోమీ నుంచి రెండు 5జీ ఫోన్లు..ధర ఎంతంటే! - MicTv.in - Telugu News
mictv telugu

షియోమీ నుంచి రెండు 5జీ ఫోన్లు..ధర ఎంతంటే!

February 13, 2020

Xiaomi.

ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థ షియోమీ..ఎంఐ 10, ఎంఐ 10 ప్రో పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు ఈరోజు చైనాలో విడుదల చేసింది. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన ఎంఐ 10 ప్రారంభ ధర 572 డాలర్లు (భారతీయ కరెన్సీలో దాదాపుగా రూ.40,920) ఉండగా, ఎంఐ ప్రొ ప్రారంభ ధర 716 డాలర్లు భారతీయ కరెన్సీలో దాదాపుగా రూ.51,150)గా ఉంది. 5జి టెక్నాలజీతో ఈ ఫోన్లు విడుదల అవుతుండడం గమనార్హం. వీటిని ఫిబ్రవరి 18 నుంచి ఈ ఫోన్లను చైనాలో సేల్ చేయనున్నారు. త్వరలో ఈ ఫోన్‌లు భారత మార్కెట్‌లోనూ సందడి చేయనున్నాయి.

 

షియోమీ ఎంఐ 10, ఎంఐ 10 ప్రొ ఫీచర్లు:

 

* 6.67 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే,

* ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌,

* 8/12 జీబీ ర్యామ్‌, 

* 128/256/512 జీబీ స్టోరేజ్‌, 

* ఆండ్రాయిడ్‌ 10,

* 108, 12, 8, 20 మెగాపిక్సల్‌ క్వాడ్ రేర్ కెమెరా సెటప్,

* 20 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, 

* 4780/4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ.