షావోమీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. 108ఎంపీ భారీ కెమెరాతో..  - MicTv.in - Telugu News
mictv telugu

షావోమీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. 108ఎంపీ భారీ కెమెరాతో.. 

March 19, 2020

phon..

108 ఎంపీ భారీ కెమెరాతో రెండు వేరియంట్లలో ప్రముఖ మైబైల్ కంపెనీ షావోమి కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనుంది. 12 జీబీ ర్యామ్‌, 512 స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌ ఆప్షన్లతో  ఇండియాలో తన మొట్టమొదటి 5జీ ఎంఐ 10 స్మార్ట్‌‌ఫోన్‌ను మార్చి 31న మార్కెట్‌లోకి విడుదల చేస్తోందని.. షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు కస్టమర్లు ప్రీ ఆర్డర్లు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అమెజాన్‌ ఆన్‌లైన్‌లో సేల్‌‌లో ఈ స్మార్ట్‌‌ఫోన్‌‌ను బుక్ చేసుకోవచ్చు. రూ. 42,400 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో తక్షణం రూ.2500 క్యాష్‌‌బ్యాక్‌ సదుపాయం అందిస్తోంది. డెబిట్‌ కార్డ్‌ ద్వారా రూ. 2 వేల డిస్కౌంట్‌ సదుపాయాన్ని వినియోగదారలకు అందిస్తోంది. చైనాలో మార్కెట్‌లో ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 

ఎంఐ 10 స్మార్ట్‌ఫోన్‌​ ఫీచర్లు ఇలా.. 

-6.67 అంగుళాల డిస్‌ప్లే

-ఆండ్రాయిడ్‌ 10

-8జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌

-12 జీబీ ర్యామ్‌, 512 స్టోరేజ్‌

-క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 సాక్‌ప్రాసెసర్

-1080×2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌

-20 ఎంపీ సెల్పీ కెమెరా

-108+13+ 2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమరా

-4780 బ్యాటరీ సామర్థ్యం