ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న చైనా సంస్థ షావోమి మరో ఫిట్నెస్ బ్యాండ్ తీసుకువచ్చింది. ఎంఐ బ్యాండ్3ఐ పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంఐ బ్యాండ్3కి కొనసాగింపుగా కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చారు. రూ. 1,299 అతి తక్కువ ధరకే దీన్ని వినియోగదారులకు అందించనున్నారు. నలుపు రంగులో మాత్రమే ఈ బ్యాండ్ లభించనుంది.
దీంట్లో బ్లూటూత్ ద్వారా మొబైల్ నోటిఫికేషన్, ఫిట్నెస్, రాబోయే మూడు రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందని అనే విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.4, ఐవోఎస్ 9.0 ఆపై వెర్షన్లు కలిగిన ఫోన్లతో అనుసంధానం చేయొచ్చు. ఒకసారి చార్జింగ్ చేస్తే సుమారు 20 రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. కేవలం 2.5 గంటల్లోనే దీన్ని ఫుల్ చార్జింగ్ చేసుకోవచ్చు. 0.78 అంగుళాల మోనోక్రోమ్ వైట్ అమోలెడ్ టచ్ డిస్ప్లే అమర్చారు. ఎంఐ బ్యాండ్3 కంటే కూడా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లతో దీన్ని అందించనున్నారు.