రూ.2355కే...షియోమీ డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై రూట‌ర్‌... - MicTv.in - Telugu News
mictv telugu

రూ.2355కే…షియోమీ డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై రూట‌ర్‌…

June 6, 2017

‘ఎంఐ రూట‌ర్ 3జీ’ పేరిట షియోమీ కొత్త వైఫై రూట‌ర్‌ను రిలీజ్ చేసింది. రూ.2355 కే యూజ‌ర్లు దీన్ని కొనొచ్చు. డ్యుయ‌ల్ బ్యాండ్ టెక్నాల‌జీ ఈ వైఫై రూట‌ర్ ప్రత్యేకత. దీంతో చాలా దూరం వ‌ర‌కు కూడా వైఫై సిగ్న‌ల్స్ అందుతాయి. రూట‌ర్ వేగంగా ప‌నిచేసేలా ప్ర‌త్యేకమైన డ్యుయ‌ల్ కోర్‌ ప్రాసెస‌ర్‌, 256 ఎంబీ ర్యామ్‌ల‌ను ఇందులో ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల గ‌రిష్టంగా 1167 ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూటర్‌ను ఆపరేట్ చేసుకోవ‌చ్చు. 128 డివైస్‌ల‌కు దీన్ని ఏక‌కాలంలో క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ల‌భిస్తున్న ఎంఐ వైఫై యాప్‌ను వేసుకుంటే రూట‌ర్‌ను ఫోన్ ద్వారానే యాక్సెస్ చేయ‌వ‌చ్చు.