షావోమి మరో సంచలనం..ఇక మడతపెట్టడమే! - MicTv.in - Telugu News
mictv telugu

షావోమి మరో సంచలనం..ఇక మడతపెట్టడమే!

May 24, 2020

redd

స్మార్ట్ ఫోన్ రంగం కొత్త పుట్టలు తొక్కుతోంది. రోజు రోజు కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. తాజాగా ఫోల్డబుల్ ఫోన్ల హవా నడుస్తోంది. దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీలు మడతపెట్టే ఫోన్లను రూపొందించే పనిలో ఉన్నాయి. ఇప్పటికే శాంసన్, మోటోరోలా కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెల్సిందే. తాజాగా షావోమి కంపెనీ ఫోల్డబుల్ ఫోన్ల తయారీకి పూనుకుంది.

ఇటీవల ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూపకల్పనకు సంబంధించి డిజైన్‌ పేటెంట్‌ను సొంతం చేసుకుంది. ఈ ఫోన్‌లో రొటేటింగ్‌ క్వాడ్-కెమెరా ప్రధాన ఫీచర్‌గా వుండటం గమనార్హం. ఈ షావోమి ఫో‍ల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ కెమెరా సెల్ఫీల కోసం ముందుకి, సాధారణ ఫోటోల కోసం వెనక్కి రొటేట్‌ అవుతుందట. స్మార్ట్‌ఫోన్లలో రొటేటింగ్‌ కెమెరా ఇప్పటికే ఉన్నప్పటికీ మడతఫోన్లలో ఇదే తొలిసారి.