ఆకట్టుకునే ఫీచర్లు.. రూ.7,999 లకే ‘రెడ్‌మీ 7’ - MicTv.in - Telugu News
mictv telugu

ఆకట్టుకునే ఫీచర్లు.. రూ.7,999 లకే ‘రెడ్‌మీ 7’

April 24, 2019

కొంతకాలంగా వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తున్న షావోమీ మరో లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువచ్చింది. రెడ్‌మీ 7  పేరిట ఈ సరికొత్త ఫోన్‌ను విడుదల చేసింది షావోమీ. కొద్ది రోజుల క్రితమే రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో రిలీజైంది. సెల్ఫీ టైమర్, ఏఐ డ్యూయెల్ కెమెరా, ఏఐ పోర్ట్‌రైట్ మోడ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఫేస్ అన్‌లాక్, ఏఐ స్మార్ట్ బ్యూటీలాంటి ప్రత్యేకతలతో ఈ ఫోన్ లభిస్తుంది. ఏప్రిల్ 29న అమెజాన్, mi.com, ఎంఐ స్టోర్స్‌లో ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి. రిలయన్స్ జియో నుంచి నాలుగేళ్ల పాటు డబుల్ డేటా, రూ.2,400 క్యాష్‌బ్యాక్ లభిస్తుందని షావోమీ ప్రకటించింది.

Xiaomi Redmi 7 First Impressions Xiaomi’s refined look at the budget segment!

రెడ్‌మీ 7  ప్రత్యేకతలు ఇవే…

  • 6.26 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే+(1520×720 పిక్సెల్స్), 19:9 యాస్పెక్ట్ రేషియో
  • 2 జీబీ, 3 జీబీ ర్యామ్
  • 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్
  • 12+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
  • 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • ఎంఐయూఐ 10, ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్
  • డ్రీమ్ బ్లూ, చార్మ్ నైట్ రెడ్, బ్రైట్ బ్లాక్ కలర్స్

ధర:
2జీబీ+32జీబీ- రూ.7,999
3జీబీ+32జీబీ- రూ.8,999

Xiaomi Redmi 7 First Impressions Xiaomi’s refined look at the budget segment!