మార్కెట్లోకి రెడ్‌మీ 8 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..!    - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్లోకి రెడ్‌మీ 8 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..!   

October 9, 2019

Xiaomi Redmi 8

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి మరో ఆవిష్కరణ చేసింది. బుధవారం మార్కెట్లోకి సరికొత్త హంగులతో రెడ్‌మీ 8 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌మీ 7కు అప్డేట్ వర్షన్ ఫోన్ రెడ్‌మీ 8 సిరీస్ ఫోన్‌ను తీసుకువచ్చింది. కేవలం రూ. 8,999, రూ. 7,999 రెండు వర్షన్లలో ఈ ఫోన్ లభించనుంది. అక్టోబర్ 12 నుంచి ఇది కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. అత్యుత్తమ ఫీచర్స్, డ్యూయల్ కెమెరా, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ,4 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజీతో మార్కెట్లోకి రాబోతున్నాయి. టైప్ సీ చార్జింగ్,ఫింగర్ ప్రింట్ వర్షన్, అల్టిమేట్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఫీచర్స్ వీటిలో ఉన్నాయి.  బ్లూ, బ్లాక్‌ కలర్‌లో ఈ ఫోన్ లభించనుంది. 

 

రెడ్‌మీ 8 ఫీచర్స్ : 

 

ర్యామ్ : 4 జీబీ, స్టోరేజీ 64 జీబీ

స్క్రీన్ : 6.22 అంగుళాల డిస్‌ప్లే

బ్యాక్ కెమెరా : 12+2 ఎంపీ 

ఫ్రంట్ కెమెరా :  8 ఎంపీ 

బ్యాటరీ : 5000 ఎంఏహెచ్ 

ప్రాసెసర్ : స్నాప్‌ డ్రాగన్‌ 439

3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ ధర రూ. 7,999

4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ ధర రూ. 8,999