రూ.6వేల లోపే రెడ్‌మీ స్మార్ట్ ఫోన్లు…అదిరిపోయే ఫీచర్లు
భారతదేశంలో ఫ్లాష్ సేల్స్ ద్వారా షావోమి కంపెనీ తన ఫోన్లను ఎక్కువగా విక్రయిస్తుంది. ఈ ఫోన్లకు మార్కెట్ లోనూ మంచి గిరాకీ ఉంది. ఈ మధ్య ఈ బ్రాండ్ లో వస్తున్న ఫోన్లను వినియోగించేందుకు యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా షావోమి సరికొత్తగా రెండు మొబైల్ ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Redmi A2, Redmi A2+ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో రీసెంట్గా విడుదలయ్యాయి. గురువారం నుంచి ఈ ఫోన్ల విక్రయాలను కంపెనీ ప్రారంభించింది. అతి తక్కువ ధరలో, మంచి ఫీచర్లతో ఈ ఫోన్లను రూపొందించింది. అంతే కాదు ఈ స్మార్ట్‌ఫోన్లపైన సంస్థ ఆకర్షణీయమైన ఆఫర్లను యూజర్లకు అందిస్తోంది. తాజాగా విడుదల చేసిన రెండు స్మార్ట్‌ఫోన్లలో ఒకే రకమైన ఫీచర్లు ఉన్నాయి. రెడ్‌మీ A2+ లో అదనంగా ఫింగర్ ప్రింట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 2022లో విడుదల చేసిన A1 సిరీస్ తో పోల్చితే A2 సిరీస్‌లో ప్రత్యేక హంగులను అద్ది, శక్తివంతమైన చిప్‌లను జత చేర్చారు మేకర్స్.
రెడ్‌మీ A2 స్మార్ట్‌ఫోన్ మూడు మోడళ్లలో అందుబాటులో ఉంది. 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ, 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ, 4జీబీ RAM , 64జీబీ స్టోరేజీ కెపాసిటీతో ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ మోడల్ ఫోన్ ధర రూ.6,299 కు అందుబాటులో ఉంది. ఏదైనా బ్యాంకు కార్డుతో ఆర్డర్ చేస్తే రూ.5,999 చెల్లిస్తే సరిపోతుంది. 64 జీబీ స్టోరేజీ ఫోన్ రూ.6,999 కే అందుబాటులో ఉంది. ఇక 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ మోడల్ ఫోన్ ధర రూ.7,999 పలుకుతోంది. రెడ్‌మీ A2+ స్మార్ట్‌ఫోన్ మాత్రం ఒకే ఒక్క మోడల్లో అందుబాటులో ఉంది. 4జీబీ RAM 64 జీబీ స్టోరేజీతో అందుబాటులో ఉన్న ఫోన్ ధర రూ.8,499గా కంపెనీ నిర్ణయించింది.
రెండేళ్ల వారెంటీ :
రెడ్‌మీ నుంచి విడుదలైన ఈ కొత్త సిరీస్ ఫోన్లు అమేజాన్, ఎంఐతో పాటు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్, సీ గ్రీన్ కలర్స్‌లో లభిస్తున్నాయి. ఐసిఐసిఐ కార్డులు ఉన్నవారికి అదనంగా క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. కార్డు ఉపయోగించి ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంతే కాదు ఈ స్మార్ట్ఫోన్లకు రెండేళ్ల వారింటీ అందిస్తోంది కంపెనీ. ఈ రెండు మోడల్స్ కు దాదాపుగా ఒకే రకమైన ఫీచర్లు ఉన్నాయి. 6.52 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తాయి. మీడియా టెక్ హెల్లో G36 ప్రాసెసర్‌తో A2 సిరీస్‌లోని స్మార్ట్ ఫోన్స్ పని చేస్తాయి.
కెమెరా క్లారిటీ, బ్యాటరీ సామర్థ్యం :
సెల్ఫీలకు , వీడియో కాల్స్‌కు మంచి ఆప్షన్‌గా ఉన్నాయి ఈ ఏ2 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్. 5 ఎంపి ఫ్రంట్ కెమెరాను ఈ మోడల్స్‌కు అందించారు మేకర్స్. 8 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్స్, A1 సపోర్ట్‌తో ఫోన్స్‌ను డ్యుయల్ సెటప్‌తో తయారు చేశారు. 5000 mAh బ్యాటరీని ఈ మొబైల్స్ కు అందించారు.
మైక్రో USB పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్‌తో ఈ ఫోన్లను తయారు చేశారు.