షియోమీ నుంచి త్వరలో 5జీ స్మార్ట్‌ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

షియోమీ నుంచి త్వరలో 5జీ స్మార్ట్‌ఫోన్

November 26, 2019

ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షియోమీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలో అది మార్కెట్‌లోకి రానుంది. ఇంతలో షియోమీ 5జీ ఫోన్‌లను తీసుకొని వచ్చింది. డిసెంబర్ 10న రెడ్‌మీ కె30 సిరీస్ ఫోన్లను చైనా మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వాటిలో 5జీ వేరియెంట్ ఫోన్ కూడా ఉండనుంది. రెడ్‌మీ కె30, కె30 ప్రొ పేరిట షియోమీ రెండు ఫోన్లను విడుదల చేస్తుంది. కె30 ప్రొ వేరియెంట్‌లో 5జీ ఫీచర్ ఉంటుందని సమాచారం. అందుకు గాను ఆ ఫోన్‌లో ప్రత్యేకంగా 5జీని సపోర్ట్ చేసే ప్రాసెసర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇక ఈ ఫోన్లకు సంబంధించిన కొన్ని ఫీచర్లు మాత్రమే బయటికి వచ్చాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Xiaomi Redmi K30.

రెడ్‌మీ కె30 ఫీచర్లు

 

* స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్,

* 6.66 ఇంచుల డిస్‌ప్లే,

* ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 

* 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్.