పేలిన రెడ్ మీ నోట్ 4.. - MicTv.in - Telugu News
mictv telugu

పేలిన రెడ్ మీ నోట్ 4..

July 24, 2017

షియోమి కంపెనీకి చెందిన రెడ్ మి నోట్4 భారత్ మార్కెట్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. బెంగళూర్ కు చెందిన అర్జున్ అనే అతను స్థానికంగా ఉన్న మెుబైల్ షోరూంలో రెడ్ మీ నోట్ 4 కొనుగోలు చేశాడు.అయితే ఫోనులో సిమ్ వేయడం రాక అదే షోరూంకు వెళ్లాడు అర్జున్ . ఆషోరూంలో టెక్నీషియన్ గా పనిచేసే వ్యక్తి ప్యానల్ తీయగా ఒక్కసారి మంటలు వచ్చాయి. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదు. అర్జున్ స్థానిక పోలిసు స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చాడు.