షామీ నుంచి మరో సరికొత్త ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

షామీ నుంచి మరో సరికొత్త ఫోన్

May 21, 2019

Xiaomi Redmi Note 7S with 48MP camera launched in India Price, specifications, features.

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షామీ మరో సరికొత్త మొబైల్‌ రెడ్‌మి నోట్‌7ఎస్‌‌ను సోమవారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 48 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా కలిగి ఉండడం ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఇది రెండు వేరియంట్లలో లభించనుంది. 3జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం కలిగిన ఫోన్‌ ధర రూ.10,999 కాగా, 4జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఫోన్‌ రూ.12,999గా నిర్ణయించారు. బ్లూ, రుబీ రెడ్‌, బ్లాక్‌ రంగుల్లో ఇది లభ్యం కానుంది. మే 23 మధ్యాహ్నం 12గంటలకు ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ హోమ్స్‌ వెబ్‌సైట్‌లో ఇది విక్రయానికి రానుంది. త్వరలోనే ఆఫ్‌లైన్‌లోనూ లభించనుంది.

రెడ్‌మి నోట్‌7ఎస్‌‌ ఫీచర్లు

* 6.3 ఫుల్‌హెచ్‌డీ+డిస్‌ప్లే

* స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌

* ఆండ్రాయిడ్‌ పై

* 48+5మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ రేర్ కెమెరా

* 13 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా

* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

* టైప్‌సీ పోర్ట్‌, క్విక్‌ఛార్జింగ్‌ 4.0