Xiaomi released the Redmi 11 phone in the Indian market
mictv telugu

రెడ్‌మీ నుంచి 64 ఎంపీతో కొత్త ఫోన్.. ధర 14 వేలే

August 31, 2022

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ కొత్తగా ఓ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రెడ్ మి నోట్ 11 ఎస్ ఈ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ. 13,999 మాత్రమే. 64 ఎంపీ కెమెరా ప్రధాన ఆకర్షణ కాగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ మెమొరీతో సంస్థ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. అలాగే బుధవారం నుంచే అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లలో అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ తెలిపింది. వెనుక నాలుగు కెమెరాలతో వచ్చిన ఈ ఫోన్‌లో ఉన్న మరిన్ని ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.

ఈ ఫోన్ లో ఫుల్ హెచ్ డీ ప్లస్ (1,080 x 2,400) రిజల్యూషన్తో 6.43 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ ప్లే అందుబాటులో ఉంది. ముందువైపు పంచ్ హోల్ తో సెల్ఫీ కెమెరా అమర్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ ఉంది.మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ తో మాలి జీ76 గ్రాఫిక్స్ ప్రాసెసర్ ను అమర్చారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంను లోడ్ చేశారు. 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 4కె వీడియోలను తీసుకోవచ్చు. ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్టు చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ సదుపాయం ఉంది. 8.29 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉన్న ఈ ఫోన్ బరువు 178.8 గ్రాములు. ఈ ఫోన్ బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ చేంజ్ ఆఫర్లు ఉన్నాయని.. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డుదారులు ఈఎంఐకొనుగోలుపై రూ.1,250 డిస్కౌంట్, సాధారణ కొనుగోలుపై రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది.