ప్రస్తుతం భారత్లో పండగ సీజన్ నడుస్తోంది. ఈ కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ…వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను ప్రారంభించాయి. దీంతోపాటు ప్రముఖ కంపెనీ షియోమీ కూడా రిపబ్లిక్ డే సేల్ ను ప్రారంభించింది.
షియోమీలో ఆఫర్లు..
షియోమీ తన అధికారిక వెబ్ సైట్ అయిన mi.comలో రిపబ్లిక్ డే సేల్ ను ప్రారంభించింది. ఇది జనవరి 16 నుంచి జనవరి 20 వరకు ఉండనుంది. షియోమీ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై గొప్ప తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
షియోమీ 5A 32 ఇంచ్ స్మార్ట్ టీవీ:
ఈ స్మార్ట్ టీవీ విక్రయాల్లో భాగంగా, కంపెనీ ప్రీపెయిడ్ ఆర్డర్లపై రూ. 1000 అదనపు తగ్గింపును అందిస్తోంది. దీంతో 12499విలువ చేసే ఈ 32-అంగుళాల స్మార్ట్ టీవీ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా మీకు రూ. 10500 లకు లభిస్తుంది.
రెడ్మీ 10 స్మార్ట్ఫోన్
ఈ స్మార్ట్ఫోన్ను షియోమి రిపబ్లిక్ డే సేల్లో రూ. 2900 తగ్గింపుతో అందిస్తోంది. దీని అసలు ధర రూ. 10,999. ఆఫర్ కింద 4జిబి, 64జిబీ వేరియంట్ ధర రూ. 8099గా నిర్ణయించబడింది.
అంతేకాదు షియోమీ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా మీర్ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్స్ ను పొందుతారు. దీంతో మరింత తగ్గింపు పొందాలనుకుంటే మీరు Paytm వాలెట్ చెల్లింపులపై 10% శాతం (గరిష్టంగా రూ. 1000) పొందితే, ICICI క్రెడిట్ కార్డ్లు EMI చెల్లింపులపై రూ.3000 తక్షణ తగ్గింపును ప్రకటించింది.