వావ్..నెలలో 10లక్షల మంది కొన్న ఫోన్ ఇదే... - MicTv.in - Telugu News
mictv telugu

వావ్..నెలలో 10లక్షల మంది కొన్న ఫోన్ ఇదే…

June 27, 2017

స్మార్ట్ ఫోన్ అంటే ఇదే.. హై ఫీచర్స్ తో బడ్జెట్ ఫోన్. కొంటే దీన్ని కొనాలి. 30రోజుల్లో 10లక్షలమంది ఆ ఫోన్‌ కొన్నారు. ఇందులో స్పెషల్ ఏముందంటే .

చైనా మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ భారత్‌ మార్కెట్‌లో దుమ్మురేపుతోంది. తక్కువ, మధ్య స్థాయిధరల శ్రేణిలో అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ల అమ్ముతూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. గత నెలలో షియోమీ నుంచి వచ్చిన రెడ్‌మీ 4 స్మార్ట్‌ఫోన్‌ 30 రోజుల్లో 10లక్షలు అమ్ముడయ్యాయి. ఫ్లాష్‌సేల్స్‌, ప్రీ ఆర్డర్స్‌ ద్వారా ఈ రికార్డును సాధించింది.

రెడ్‌ మి4 ప్రత్యేకతలు

# 5 అంగుళాల తాకే తెర

# 1.4గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌

# 2జీబీ/3జీబీ/4జీబీ ర్యామ్‌(ధర రూ.6,999, రూ.8,999, రూ.10,999)

#16జీబీ/ 32జీబీ/ 64జీబీ అంతర్గత మెమొరీ

#ఆండ్రాయిడ్‌ మార్ష్‌మాలో 6.0.1

#13, 5 మెగాపిక్సెల్‌తో బ్యాక్ , ఫ్రంట్ కెమేరాలు

# 4,100 ఎంఏహెచ్‌ బ్యాటరీ