త్వరలో షియోమి నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో షియోమి నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్

July 13, 2017

ఇప్పటికే భారత మార్కెట్ లో తన హవా కొనసాగిస్తున్న షియోమి.వచ్చే వారంలో ఢిల్లీ
లో ఈవెంట్ నిర్వహించబోతుంది.ఈ లాంచ్ ఈవెంట్ కోసం ఆహ్వానాలు
పలుకుతుంది.ఇంతకి ఈవెంట్ లో లాంచ్ చేయబోయేంది ఏంటి అనుకుంటున్నారా.!ః

షియోమి ఎంఐ మ్యాక్స్2 స్మార్ట్ ఫోన్ ను మే నెలలో చైనాలో లాంచ్ చేసింది. ఎంఐ మ్యాక్స్2
స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు భారత్ లో ఈ నెల 18 న లాంచ్ చేయబోతుంది.దీని ధర రూ. 16,100
గా ఉంటుందట.! దీని ప్రత్యేకత బిగ్ స్క్రీన్ ,బ్యాటరీ,ఎంఐ మ్యాక్స్ పోలిన మాదిరిగానే
ఎంఐ మ్యాక్స్2 డిజైన్ కూడా ఉంది. బిగ్ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్ తో షియోమి
ఈ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది.

ఎంఐ మ్యాక్స్2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..
6.44 అంగుళాలతో ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే,5300ఎంఏహెచ్ బ్యాటరీ.
ఆక్టో _కోర్ స్నాప్ డ్రాగన్ 625 ఎస్ఓసీ 4జీబీ ర్యామ్.
64జీబీ,128జీబీ స్టోరేజ్ వేరియంట్లు 12ఎంపీ రియర్ కెమెరా,5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
ఎంఐయూఐ ఆధారాత ఆండ్రాయిడ్ నోగట్,4జీబీ వీవోఎల్ఈ ,డ్యూయల్ బ్యాండ్ వైపై,
బ్లూటూత్ 4.2,యూఎస్ బీ టైప్ సి, క్విక్ చార్జ్ 3.0.
అయితే కంపెనీ రెండు వేరియంట్ల ను భారత్ లో ఎప్పుడు లాంచ్ చేస్తుందో లేదో ఇంకా
చెప్పలేదు.