Y.S.jagan speech at global summit
mictv telugu

త్వరలో విశాఖ నుంచే పరిపాలన : సీఎం జగన్

March 3, 2023

Y.S.jagan speech at global summit

Y.S.Jagan: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. అతి త్వరలో విశాఖ నుంచే పరిపాలనను సాగిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎగుమతుల పరంగా, ఉపాధి అవాకాశాల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని , పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని సీఎం తెలిపారు.

విశాఖలో ఈ రోజు ఎంతో గ్రాండ్ గా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. పారిశ్రామికవేత్తలతో సహా ప్రజాప్రతినిధులు, సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో మొదటి రోజే సీఎం పలు కీలక అంశాలను వెల్లడించారు. ఏపీలోని పారిశ్రామిక అవకాశాలు, భవిష్కత్తులో పెట్టుబడులపైన జగన్ పలు ప్రకటనలు చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ముఖ్యమంతి తెలిపారు.

సమ్మిట్ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 340 కంపెనీలు, 20 రంగాల్లో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు. సమ్మిట్ ప్రారంభమైన మొదటి రోజే ఏకంగా 92 కంపెనీలో ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు సీఎం. తద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో అనేక రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చామన్నారు జగన్. రాష్ట్రంలో ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. విశాఖ రాజధాని గురించి కీలకమైన విషయాలను తెలిపారు సీఎం. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు విశాఖ కేరాఫ్ అడ్రస్ అన్నారు. సుదీర్ఘమైన తీరప్రాంతం కలిగిన విశాఖ నుంచే త్వరలో పరిపాలనను కొనసాగిస్తమని సంచలన ప్రకటన చేశారు జగన్.