ఆదుకోండయ్యా.. యాదాద్రి జిల్లాలో రైతు బిడ్డ వినూత్న నిరసన - MicTv.in - Telugu News
mictv telugu

ఆదుకోండయ్యా.. యాదాద్రి జిల్లాలో రైతు బిడ్డ వినూత్న నిరసన

September 21, 2020

c bc n

వర్షాల కారణంగా రైతు పడుతున్న బాధలను ఓ రైతు బిడ్డ కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. తమకు జరిగిన నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్న పద్దతిలో స్పందించాడు. పొలంలో మెడ వరకు నిలిచిపోయిన వరద నీటిలో దిగి దండం పెడుతూ ఆదుకోవాలంటూ వేడుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న బాలుడు చేసిన పనితో వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించారు. స్థానిక రైతుల సమస్యలు తీర్చాలని ఆదేశాలు ఇచ్చారు. 

వలిగొండ మండలం అర్రూర్‌ గ్రామానికి చెందిన రైతు దొంతి అయిలయ్య ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇప్పటి వరకు రూ. 1.5 లక్షలు ఖర్చు చేశాడు. తీరా పొట్ట దశలో ఉండగా భారీ వర్షాలతో  పైన ఉన్న కుంట నిండిపోయింది. దీంతో అతని పొలంలోకి వరద నీరు రావడంతో పూర్తిగా మునిగిపోయింది. అలుగు వెళ్లేందుకు కాల్వ ఏర్పాటు చేయకపోవడంతో చాలా కాలంగా ఇలాంటి సమస్యలే వారికి ఎదురు అవుతున్నాయి. ఈ నష్టం చూసి చలించి పోయిన అతని మనవడు వరుణ్‌ కలత చెందాడు. వెంటనే తాత ఇబ్బందులను బయట ప్రపంచానికి తెలిపేందుకు రెండు చేతులతో దండం పెడుతూ నిరసనకు దిగాడు. రైతు పండించిన అన్నమే తింటూ రైతుల కష్టాలు ఎందుకు పట్టించుకో అంటూ అధికారులను ప్రశ్నించాడు. ఇది వైరల్ కావడంతో తూము సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.