యాదాద్రి స్వామి విగ్రహాన్ని చెక్కలేదు.. ప్రధాన అర్చకుడు - MicTv.in - Telugu News
mictv telugu

యాదాద్రి స్వామి విగ్రహాన్ని చెక్కలేదు.. ప్రధాన అర్చకుడు

December 4, 2019

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అపచారాలు జరిగాయని మీడియాలో వస్తున్న కథనాలు కలకలం రేపుతున్నాయి. వాటిని ఖండిస్తూ ఆలయ ప్రధాన అర్చకుడు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అవి తప్పుడు కథనాలని, తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వార్తలను ప్రచురించడం మంచిది కాదన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో పొరపాట్లు జరగలేదని స్పష్టం చేశారు.  

Yadadri.

ఆలయలో పనులు జరుగుతుంటే రసాయనాలతో నష్టం జరుగుతుందని తామే స్వయంగా స్వామి వారి నుదుటిపై సింధూరాన్ని తొలగించామని చెప్పారు. యాదాద్రి నరసింహస్వామి రూపంలో ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. మూల విరాట్‌ రూపం చెక్కు చెదరలేదని స్పష్టం చేశారు. నరసింహస్వామి రూపమే ఉగ్రరూపమని.. అమ్మవారితో ఉండే శ్రీలక్ష్మీనారసింహుడు ప్రశాంతమూర్తి అని తెలిపారు. 40 ఏళ్లుగా స్వామి వారికి కైంకర్యాలు చేస్తున్నాను. స్వామి వారికి ఎలాంటి కళంకం జరగలేదు. తిరుపతి, శ్రీశైలం ఆలయాల్లో కూడా స్వామి వార్ల మూలవిరాట్‌పై ఉన్న చందనాన్ని, సింధూరాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తారు. ఇది సర్వసాధారణమైన విషయం అని నరసింహాచార్యులు స్పష్టం చేశారు.