యాదాద్రి కలెక్టర్ కారును ఢీకొట్టిన లారీ.. అనిత సేప్ - MicTv.in - Telugu News
mictv telugu

యాదాద్రి కలెక్టర్ కారును ఢీకొట్టిన లారీ.. అనిత సేప్

October 15, 2020

Yadadri collector anita car met with accident

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. భువనగిరి మండలం అనాజీపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. 

కారు డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి కలెక్టర్‌ సహా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకుండా కాపాడారు. కలెక్టర్‌ వాహనం ముందుభాగం మాత్రం పూర్తిగా దెబ్బతింది. భారీ వర్షాల కారణంగా చౌటుప్పల్, రామన్నపేట మండలాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించి భువనగిరి క్యాంపు కార్యాలయానికి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తరువాత అడిషినల్ కలెక్టర్ కారులో కలెక్టర్ తన కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు ఆ లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.