రేపటి నుంచి యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నామని గురువారం ఆలయ ఈవో గీత తెలిపారు. లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులను కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తరలిస్తామని ఆమె అన్నారు. ఆమె మాట్లాడుతూ..”భక్తుల తరలింపునకు అయ్యే మొత్తం ఖర్చును దేవస్థానమే భరిస్తుంది. త్వరలో స్వామివారి నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు జోడు సేవలు ప్రారంభిస్తాం” అని ఈవో తెలిపారు.
అనంతరం నిత్య కైంకర్యాల వేళలను దేవస్థానం ప్రకటించింది.
1. ఉదయం 4గంటల నుంచి 4.30వరకు
2. సుప్రభాతం 4.30 – 5.00వరకు
3. బిందె తీర్థం, ఆరాధన, 5నుంచి 5.30గంటల వరకు
4. బాలభోగం, 5.30- 6గంటల వరకు
5. పుష్పాలంకరణ సేవ, 6 గంటల నుంచి 7. 30 వరకు
6. సర్వదర్శనం 7. 30- 8.30వరకు
7. నిజాభిషేకం 8.30- 9గంటల వరకు
8. సహస్రనామార్చన, 9- 10 వరకు
9. బ్రేక్ దర్శనం ఉదయం 10- 11.45 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్ల దేవస్థానం తెలిపింది.