నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..

February 26, 2020

v bn nvg

తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్దిగాంచిన దేవాలయాలలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే ఈ ఏడాది కూడా వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా చేయనున్నారు. 

ఈ రోజు నుంచి మార్చి 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28న అలంకార వేడుకలు నిర్వహించనున్నారు. మార్చి 3న ఎదుర్కోలు, 4న తిరుకల్యాణం, 5న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం, 7న అష్టోత్తర శత ఘటాభిషేకం జరగనుంది. ప్రధాన ఆలయ విస్తరణ పనులు జరుగుతుండటంతో బాలాలయంలోనే ఉత్సవాలు నిర్వహించనున్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు శాశ్వత, మొక్కు కల్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, సుదర్శన నారసింహ హోమాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.