8 నుంచి యాదాద్రి స్వామి దర్శనం.. పిల్లలకు, వృద్ధులకు నో ఎంట్రీ  - MicTv.in - Telugu News
mictv telugu

8 నుంచి యాదాద్రి స్వామి దర్శనం.. పిల్లలకు, వృద్ధులకు నో ఎంట్రీ 

June 3, 2020

Yadadri lakshmi narasimha swamy temple devotees rules

యాదాద్రి ఆలయం కొత్త రూపురేఖలతో భక్తులకు కనువిందు చేస్తోంది. లాక్‌డౌన్ వల్ల భక్తులు స్వామివారిని చూసుకోలేకపోయారు. ఆలయాలకు సడలింపులు ఇవ్వడంతో ఈ నెల 8 నుంచి  భక్తులను అనుమతించనున్నారు. అయితే కొండపైకి కాలినడకనే వెళ్లాల్సి ఉంటుంది. ఆలయ అధికారులు సూచించి అన్ని జాగ్రత్తలను తప్పక పాటించాల్సి ఉంటుంది. 

కరోనా వ్యాపించకుండా పదేళ్ల లోపు పిల్లలను, 65 ఏళ్లు దాటిని వారిని లోనికి అనుమతించారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై ఈవో గీత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. గుట్టపైకి వాహనాలను, అనుమతించబోమని, భక్తులు నిర్దేశిత భౌతిక దూరం పాటిస్తూ నరసింహుడిని దర్శించుకోవాలని స్పష్టం చేశారుఒక వారం పాటు దర్శనాలను పరిశీలించి తర్వాత మార్పు చేర్పులు చేస్తామన్నారు. ఆర్జిత పూజలకు కూడా ఏర్పాట్లు సాగుతున్నాయని తెలిపిన ఆమె సత్యనారాయణ స్వామి వ్రతాలకు ఒక హాల్‌లో 50 జంటలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. శ్రీవారి కల్యాణానికి 25 జంటలను మాత్రమే అనుమతిస్తామన్నారు.