తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానానికి గత నెల రోజుల్లో భారీగా ఆదాయం వచ్చి చేరింది. 30 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా అక్షరాల రూ.2 కోట్ల 55 లక్షల 83 వేల 999 వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.నగదుతో పాటు 91 గ్రాములు, మిశ్రమ వెండి 4 కేజీల 650 గ్రాముల భక్తులు విరాళాల రూపంలో అందించారు. విదేశీ కరెన్సీ రూపంలో కూడా భారీగా విరాళాలు వచ్చాయి. వెయ్యి 343 అమెరికా డాలర్లు, యూఏఈ 95 దిరామ్స్, 55 ఆస్ట్రేలియా డాలర్స్, 140 కెనడా డాలర్స్, ఒమాన్ 200 బైసా, మలేషియా 10 రింగిట్స్, భూటాన్ 21 నెగటరమ్, క్వార్టర్ 12 రియాల్స్, సింగపూర్ 8 డాలర్లు, ఇంగ్లాండ్ 25 పౌండ్స్, యూరో 60 యూరోస్ విదేశీ కరెన్సీ భక్తుల ద్వారా ఆలయ ఖజానాకు చేకూరింది. హుండీ ఆదాయాన్ని కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండప భవనంలో లెక్కించారు. ఆలయ ఈఓ గీత పర్యవేక్షణలో ఈ లెక్కింపు సాగింది.