రంగురంగుల యాదాద్రి.. రెండు కళ్లూ చాలవు.. - MicTv.in - Telugu News
mictv telugu

రంగురంగుల యాదాద్రి.. రెండు కళ్లూ చాలవు..

August 1, 2020

Yadadri temple construction

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో అన్ని పనులు పూర్తి అవుతాయని ఆర్కిటెక్ ఆనంద్ సాయి తెలిపారు. తాజాగా ప్రధాన ఆలయ గోపురాలకు విద్యుద్దీపాల ట్రయల్ రన్ నిర్వహించారు. తిరుమల వెంకన్న సన్నిధిలో మాదిరిగా రాత్రి సమయంలో రాజగోపురాలన్ని, రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధానాలయం లోపల ఇప్పటికే విద్యుద్దీపాల పరిశీలన పూర్తయింది. 

ఆర్కిటెక్ ఆనంద్ సాయి, వైటీడీఏ అధికారులు, స్తపతుల సమక్షంలో ప్రధాన ఆలయ గోపురాలకు వివిధ రంగుల్లో విద్యుద్దీపాలను అమరుస్తున్నారు. బంగారం రంగులో వేసిన లైటింగ్​లో గోపురాలు మెరిసిపోతున్నాయి. పరిశీలన తరువాత దీపాలను ఎంపిక చేస్తామని వైటీడీఏ అధికారులు తెలిపారు. ప్రధానాలయం లోపల, ఏసీ ఎలక్ట్రికల్ పనులు ఆల్రెడీ పూర్తయ్యాయి. వడివడిగా ఎబోజింగ్ పనులు.. అదేవిధంగా, యాదాద్రీశుడి అష్టభుజి అంతర్ ప్రాకార మండపంలో శిల్పాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.