గిన్నిస్‌ను కుమ్మేసింది.. ఏకంగా 11 అడుగులు..  - MicTv.in - Telugu News
mictv telugu

గిన్నిస్‌ను కుమ్మేసింది.. ఏకంగా 11 అడుగులు.. 

September 18, 2020

Yak with the longest horns pokes his way into Guinness World Records

ఎవరన్నా కాస్త అతి చేస్తే.. ‘ఏం రోయ్.. నెత్తిపైన కొమ్ములు మొలిచాయా’ అని హెచ్చరిస్తుంటాం. కొమ్ములు మనుషులకు మొలవకపోయినా కొమ్ముల్లోని గొప్పతనం అలా స్థిరపడిందన్నమాట. కొన్ని జంతువులకు కొమ్ములే ఆయుధాలు. కొన్ని జంతువులకు అవే చిక్కులు కూడా తెచ్చిపెడుతుంటాయి. చెట్ల కొమ్మల్లా మొలిచే కొమ్ములతో దుప్పులు నానా అగచాట్లు పడుతుంటాయి. ఇక విషయంలోకి వస్తే ఓ జడల బర్రె కొమ్ములతో పాత గిన్నిస్ రికార్డును కుమ్మిపారేసింది. 

అమెరికాలోని మిన్నెసొటాలో ఉండే జెరికో అనే సదురు బర్రె కొమ్ములు పొడవు11.36 అడుగులు. గతంలో అమెరికాకే చెరబందిన పాంచో వియా అనే ఎద్దు 10.7 అడుగులతో సాంపాదించుకున్న రికార్డును జెరికో వెనక్కి నెట్టేసింది. పాంచో కొమ్ములు సదాటంగా ఉంటే, జెరికో కొమ్ములు మెలి తిరిగి ఉన్నాయి.  బర్రెల పంపెంకం మానేసిన వ్యక్తి దాన్ని మెలోడీ, హుఫ్ అనే దంపతులకు ఆరేళ్ల కిందట పెంచుకొమ్మని ఇచ్చాడు. అంతేసి కొమ్ములున్నా జెరికో ఏమాత్రం పొగరుగా ఉండదని, ప్రేమగా ఉంటుందని ఓనర్లు చెబుతున్నారు. దీని గొప్పతనం తెలుసుకున్న గిన్నిస్ ప్రతినిధులు కొమ్ముల పొడవు కొలిచి వరల్డ్ రికార్డ్ కట్టబెట్టారు.