బట్టతల ఉన్నోడిని పెళ్లాడతా.. ‘’బాలా’ హీరోయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

బట్టతల ఉన్నోడిని పెళ్లాడతా.. ‘’బాలా’ హీరోయిన్

November 13, 2019

జుట్టు ఊడిపోతుందంటే అబ్బాయిల కష్టాలు అన్ని ఇన్నికావు. పెళ్లికి ఎక్కడ అమ్మాయి నిరాకరిస్తుందో అని భయపడిపోతుంటారు. ఈ తరహా కష్టాలపై ఇటీవల ‘బాలా’ పేరుతో వచ్చిన సినిమాలో ఆయుష్మాన్ ఖురానా  నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది. దీంట్లో ఆయుష్మాన్ భార్యగా యామి గౌతమ్ నటించారు. ఈ సినిమా తర్వాత యామికి ఓ అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. నిజ జీవితంలో కూడా బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా అంటూ ప్రశ్న రావడంతో ఆమె చాలా తెలివిగా సమాధానం చెప్పింది. 

Yami Gautam.

బట్టతల ఉన్న వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదని ప్రశ్నించింది. తానైతే అలానే చేస్తానని నవ్వుతూ చెప్పేసింది. బట్టతల పెళ్లికి అడ్డుకాదు అంటూ వ్యాఖ్యానించింది.  బట్టతల ఉన్నవారు చాలా శాంత స్వరూపులు అంటూ చెప్పుకొచ్చింది. ఎవరికైనా బట్టతల ఉంటే ముందు వారిని వారు ప్రేమించుకోవాలి. ఆ తర్వాత మిగితా వారి ప్రేమను కోరుకోవాలని సూచించారు.  అదే ఉద్దేశ్యంతో బాలా సినిమా స్టోరీ ఉంటుందని తెలిపింది. కాగా నవంబర్‌ 7న విడుదలైన బాలా సినిమా ఐదు రోజుల్లోనే రూ.61 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.