దేశవ్యాప్తంగా కన్నడ హీరో యశ్ తెలియని సినీ ప్రియులు ఉండరు. ఎందుకంటే ‘కేజీయఫ్’ సినిమాతో దేశంలోని అన్ని భాషల సినీ అభిమానులను తన నటనతో, డైలాగ్‌లతో అభిమానుల గుండెల్లో ఎప్పటీకి చెరిగిపోని ముద్ర వేసుకున్నాడు. తాజాగా యశ్ నటించిన ‘కేజీయఫ్ -2’ సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, చిత్రబృందం ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ‘కేజీఎఫ్-2’కు సంబంధించిన టీజర్‌ను, ట్రైలర్‌ను విడుదల చేసింది. విడుదలైన ట్రైలర్లో హీరో యశ్ చెప్తున్నా ఓ డైలాగ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ‘వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్, ఐ డోంట్ లైక్ ఇట్.. బట్ వైలెన్స్ లైక్స్ మీ” అంటూ చెప్పే డైలాగ్ ప్రతి నోట వినిపిస్తుంది.
సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన ‘కేజీయఫ్’కు సీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘కేజీయఫ్-2’ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో ప్రథమ స్థానంలో దూసుకెళ్తుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, నటీనటుల సంభాషణలు, హీరో చెప్పే డైలాగులు అందరితో ఈలలు వేయిస్తున్నాయి. అయితే, “కేజీయఫ్-2’కు సంబంధించిన కొన్ని సంచలన విషయాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించాడు.
”పవర్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాలో యశ్ మెయిన్ రోల్ పోషించడమే కాకుండా అతనిలోని రైటింగ్ టాలెంట్‌నీ బయట పెట్టారు. ఆయన పాత్రకు సంబంధించిన పలు డైలాగులను యశ్సే స్వయంగా రాసుకున్నాడు. ‘కేజీయఫ్-2’ ట్రైలర్ చూసిన చాలా మంది హీరో చెప్పే ప్రతి డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయని చెబుతున్నారు. అయితే, ఆయన పాత్రకు డైలాగులు రాసింది రైటర్ కాదు. చాలా డైలాగ్స్‌ని యశ్సే రాసుకున్నారు” అని ప్రశాంత్ నీల్ చెప్పారు. దీంతో యశ్ అభిమానులు ఆశ్చర్యానికి లోనైతున్నారు. తమ అభిమాన హీరోలో ఇంత టాలెంట్ ఉందా అంటూ యశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.