కన్నడ ‘అర్జున్ రెడ్డి’గా యశ్! - MicTv.in - Telugu News
mictv telugu

కన్నడ ‘అర్జున్ రెడ్డి’గా యశ్!

September 16, 2017

వివాదాలతోపాటు ప్రశంసలను కూడా మూటగట్టుకున్న సెన్సేషనల్ తెలుగు హిట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ని తమిళం, హిందీలో రీమేక్ చేయడానికి యత్నాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ఇక మనపక్కనే ఉన్న శాండల్ వుడ్ లో కూడా తాజాగా ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రముఖ కన్నడ నటుడు యశ్.. అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. యశ్.. అర్జున్ రెడ్డి పాత్ర పోషించిన విజయ్ దేవరకొండను తలపిస్తున్నాడు. జట్టు, గెడ్డం.. అన్నీ చక్కగా కుదిరిపోయాయి. విజయ్ మాదిరే యశ్ కూడా నాటకరంగం నుంచి వచ్చాడు. అర్జున్ రెడ్డి  సినిమా తమిళ వెర్షన్ లో ధనుష్, హిందీ వెర్షన్ లో రణవీర్ సింగ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.