Yash shall be doing the next film under the direction of Shankar
mictv telugu

సెన్సేషనల్ డైరెక్టర్‌తో యష్ తర్వాతి సినిమా.. వెయ్యి కోట్ల బడ్జెట్!

September 17, 2022

Yash shall be doing the next film under the direction of Shankar

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్.. ఈ సిరీస్ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ సత్తాను చాటాడు. అయితే యశ్ తర్వాత చేయబోయే సినిమా గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ కోలీవుడ్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యశ్ తన తదుపరి చిత్రాన్ని సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడని ఆ వార్త సారాంశం.

రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ అయ్యే ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించడానికి కరణ్ జోహార్, నెట్ ఫ్లిక్స్, పెన్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించడానికి ముందుకు వచ్చాయని తెలిసింది. ప్రముఖ తమిళ నవల ‘వల్పరి’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. సు. వెంకటేశ్ రాసిన ఈ నవల సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది. ఈ కాంబినేషన్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగక తప్పదు. కాగా, శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. తర్వాత కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 చేయనున్నారు. ఇవి రెండూ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. మరి యశ్ చిత్రం ఈ రెండు చిత్రాల తర్వాతే ఉంటుందా? లేక కమల్ హాసన్ చిత్రాన్ని పక్కన పెట్టి యశ్ చిత్రం ముందుకు వస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.