భారత బ్యాటింగ్ సంచలనం యశస్వి మరో రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

భారత బ్యాటింగ్ సంచలనం యశస్వి మరో రికార్డు

February 9, 2020

Yashaswi Jaiswal.

భారత బ్యాటింగ్‌ సంచలనం యశస్వి జైశ్వాల్‌  తాజాగా మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో జైశ్వాల్‌ 88 (121 బంతుల్లో 8ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకం సాధించాడు. ఈ టోర్నీలో 400 పరుగులతో అత్యధిక పరుగులు చేసి ఘనత సాధించాడు. గత ఆరు మ్యాచుల్లో యశస్వి వరుసగా 57, 29*, 57*, 62, 105*, 88 పరుగులు చేశాడు.

దీంతోపాటు అండర్‌19 ప్రపంచకప్‌లో వరుసగా ఐదు అర్ధ శతకాలు బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఉన్న ఆస్ట్రేలియన్‌ బ్యాట్స్‌మన్‌ బ్రెట్‌ విలియమ్స్‌(1988), భారత ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌(2016) లకు ఉన్న రికార్డులను జైశ్వాల్‌ అందుకున్నాడు. ఈ టోర్నీలో 10 సిక్సులు బాదిన జైశ్వాల్‌ ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా మారాడు.