బేగంపేటలో దిగిన యశ్వంత్ సిన్హా.. స్వాగతించిన కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

బేగంపేటలో దిగిన యశ్వంత్ సిన్హా.. స్వాగతించిన కేసీఆర్

July 2, 2022

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన ఆయనకు సీఎం కేసీఆర్, కేటీఆర్, ఇతర మంత్రులు ఘనస్వాగతం పలికారు. అంతేకాక, బేగంపేట నుంచి జలవిహార్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జలవిహార్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటు, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నగరంలో జరుగనుండడంతో ఇరు పార్టీలు కూడా పోటాపోటీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశాయి. దీనిపై వివాదం నడుస్తుండగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం కాలేడనే అక్కసుతో కావాలనే రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. ఇటు, ప్రధాని కూడా నగరానికి రానుండడంతో ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కాకుండా మంత్రి తలసాని స్వాగతం పలుకనున్నారు.