మాజీ కేంద్ర మంత్రి, విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నేడు ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విపక్షాల నాయకులు శరద్ పవార్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొనున్నారు.
ఇక, టీఆర్ఎస్ పార్టీ తరుపున కేటీఆర్‌తోపాటు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే కేటీఆర్ బృందం ఢిలీకి చేరుకున్నారు.
యశ్వంత్ సిన్హా.. సమర్దుడైన అడ్మినిస్ట్రేటర్‌గా, నిష్ణాతుడైన పార్లమెంటేరియగా, కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారు. ఆర్థిక, విదేశీ వ్యవహారాల వంటి కీలక శాఖలను కూడా ఆయన నిర్వహించారు. మొదటగా విపక్షాల అభ్యర్థిగా శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాల్ కృష్ణ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెరపైకి పేర్లు వచ్చినప్పటికి వారు నిరాకరించడంతో, జూన్ 21న ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా సిన్హా పేరును అధికారికంగా ప్రకటించారు.