YCP gave a strong counter to Pawan Kalyan
mictv telugu

పిచ్చి కుక్క మొరిగింది.. పవన్‌కు వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్

October 18, 2022

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, నేతలు మండిపడ్డారు. వ్యక్తిగత, వృత్తిపర జీవితంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ మాట్లాడిన వెంటనే ముందుగా ఓ మీడియాతో మాట్లాడిన అంబటి.. చెప్పుతో కొడతాడా.. రమ్మను చూసుకుందాం అంటూ సవాల్ చేశారు. పవన్ ప్యాకేజ్ స్టార్ అని ముందునుంచీ చెప్తూనే ఉన్నామని, వంద సార్లు ఈ మాట అంటానని తెగేసి చెప్పారు. ఏ రాజకీయ నాయకుడైనా తాను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని, కానీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననే పార్టీ అధ్యక్షుడిని మొదటిసారి చూస్తున్నానని ఎద్దేవా చేశారు.

తర్వాత గుడివాడ అమర్నాథ్ పీకేకి వివిధ రకాలు నిర్వచనాలు ఇచ్చారు. పీకే అంటే పిచ్చి కుక్క, పీకే అంటే ప్యాకేజీ కల్యాణ్, పీకే అంటే పెళ్లిళ్ళ కల్యాణ్ అంటూ కాసేపు పిచ్చికుక్క మొరిగిందని వ్యంగ్యంగా స్పందించారు. అటు పేర్నినాని మాత్రం ఈ వ్యాఖ్యలను భవిష్యత్ రాజకీయాలకు ముడిపెట్టారు. ఇప్పటివరకు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు చంద్రబాబుతో అంటకాగడానికి యత్నిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయనే దానికి ఇదే నిదర్శనమని అంచనా వేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ‘పీకే నువ్వేం పీకలేవు. వైసీపీని పీకేంత సత్తా నీకు లేదు. నువ్వు చంద్రబాబు దత్త పుత్రుడివని అందరికీ తెలుసు. ఆయన యాక్షన్ అనగానే నీకు ప్రెస్ మీట్ పెట్టడం అలవాటే. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి ప్రతిపక్షం లేకుండా చేస్తాం. అందరూ కట్ట కట్టుకుని రండి. నీవు కనీసం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టలేవు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ వెంట తిరిగితే పెట్రోలు బొక్క, డబ్బులు బొక్క, చెమట బొట్టు కూడా బొక్కే అంటూ తనదైన శైలిలో ఎద్దేవా చేశారు.