YCP government will provide Rs 175 crore for the construction, repair of churches in AP.
mictv telugu

ఏపీలో చర్చిల కోసమని రూ.175 కోట్లు.. ఒక్కో నియోజకవర్గానికి ఓ రూ.కోటి

November 18, 2022

ఏపీలో జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్ణయ తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు ప్రభుత్వం రూ.175 కోట్లు కేటాయించనుంది. ఒక్కో నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున ఆయా మండలాలు, గ్రామాల్లో ఉన్న చర్చిల నిర్మాణాలకు, మరమ్మత్తులకు ఈ మొత్తాన్ని అందించనుంది. జిల్లా కేంద్రాలకు మరో కోటి చొప్పున అదనంగా మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. క్రైస్తవుల శ్మశానాల ఆధునికీకరణకు కూడా ఈ నిధులను వెచ్చించాలని అధికారులు ఆదేశాలను జారీ చేశారు.

కొత్త చర్చిల నిర్మాణం, పాతవాటి పునర్నిర్మాణం, మరమ్మతులు, చర్చి నిర్వహించే సంస్థలు, శ్మశాన వాటికల ఆధునికీకరణకు ఈ నిధులు వెచ్చించాలి. ఈ నిధుల్ని గ్రాంటు ఇన్‌ ఎయిడ్‌ విధానంలో అందించనుంది. ఈ మేరకు ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని రాష్ట్ర క్రైస్తవ ఆర్థిక సంస్థ ఈ నెల 7వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం కలెక్టర్లు జిల్లాల్లో ప్రతిపాదనల స్వీకరణకు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ నెల 19లోగా ప్రతిపాదనలు అందించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక చర్చిల నిర్మాణం, మరమ్మతులు, ఇతర పనులకు భారీగానే దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 200 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.