నవంబర్ 1నే ఏపీ ఆవిర్భావ దినోత్సం.. జగన్ సర్కార్ నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

నవంబర్ 1నే ఏపీ ఆవిర్భావ దినోత్సం.. జగన్ సర్కార్ నిర్ణయం

October 18, 2019

రెండు తెలుగు రాష్ట్రాలు వేరుపడిన తర్వాత తెలంగాణలో జూన్ 2న ఆవతరణ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం ఇప్పటి వరకూ రాష్ట్ర అవతరణ ఎప్పుడనేది గడిచిన ఐదేళ్లుగా తేదీని నిర్ణయించలేదు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. అలాగే వేడుకలకు దూరంగా ఉంటూ దీక్షలు నిర్వహించారు. అయితే కొత్తగా ఏర్పడిన జగన్ సర్కార్ మాత్రం ఏపీ అవతరణ దినోత్సవంపై స్పష్టత ఇచ్చింది. 

Andhra Pradesh Formation Day.

గతంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1నే అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఈనెల 21న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణం అధికారులతో చర్చించనున్నారు. అక్టోబరు 1, 1953న మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.  ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్ర కలిపి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు జరిగింది. ఆ తేదీనే నవ్యావంధ్ర ఆవిర్భావ దినోత్సవంగా నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికారులు ఏర్పాట్లపై నిమగ్నం అయ్యారు.