అభిమానం హద్దుమీరింది. మొప్పు కోసమో లేదా ఇతర ప్రయోజనాలు కోసమో తెలియదు కానీ ఓ వైసీపీ నాయకుడికి పాలాభిషేకం జరిగింది. అతడి ఫోటోకో విగ్రహానికో చేస్తే పెద్దగా ఎవరూ పట్టించుకోరు..కానీ స్వయంగా అతడి ఒంటిపై లీటర్ల కొద్ది పాలను పోసారు. అది కూడా దేవాలయంలో ఈ పాలాభిషేకం జరగడం వివాదానికి దారి తీసింది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత కోట్ని రమేష్ పలాస-కాశీబుగ్గ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పాలాభిషేకం చేయించుకోవడంపై తీవ్ర దుమారం రేగుతోంది. కుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో అతడు అత్యుత్సాహం ప్రదర్శించారు.అమ్మవారి ధ్వజ స్థంబం సమీపంలో పాలాభిషేకం చేయించుకున్నారు. ఈఘటనపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ ధర్మాన్ని మంటగలిపారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు టీడీపీ విమర్శలు గుప్పించింది. దేవుళ్ల కంటే తామే ఎక్కువ అని విర్రవీగుతున్నారంటూ ట్వీట్‌లో వెల్లడించింది. అతడు మంత్రి సీదిరి అప్పలరాజుకు దగ్గర వ్యక్తి అని తెలుస్తోంది.
కన్యకాపరమేశ్వరి ఆలయంలో పాలాభిషేకం చేయించుకున్న వైసీపీ నేత, మంత్రి సీదిరి రైట్ హ్యాండ్…
దేవుళ్ల కంటే తామే ఎక్కువ అని విర్రవీగుతున్నారు వైసీపీ నేతలు.పలాస-కాశీబుగ్గ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంత్రి అప్పలరాజు రైట్ హ్యాండ్, కోట్ని రమేష్ పాలాభిషేకం చేయించుకున్నారు. pic.twitter.com/uO4KsAaDTs
— Telugu Desam Party (@JaiTDP) March 7, 2023