ప్రస్తుతం టీడీపీకి గడ్డుకాలం నడుస్తోంది. 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లు రావడం తద్వారా ఆ పార్టీ నాయకులు వైసీపీలోకి చేరడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. మిగిలిన వారిలో సగం మంది సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావడం లేదు. ఇక చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించేందుకు ఆ స్థాయి నాయకుడు లేకపోవడంతో అంతా తానై చూసుకుంటున్నారు. లోకేష్ ప్రజల్లోకి వెళ్తున్నా.. అతడి నాయకత్వంపై పచ్చపార్టీ నాయకులు కొంత అసంతృప్తిగానే ఉన్నారు.
పార్టీకి పూర్వ వైభవం రావాలంటే జూ.ఎన్టీఆర్ రావాలని కార్యకర్తలు, అభిమానులది బలమైన కోరిక. వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ కార్యక్రమాల్లో కూడా ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనబడడంతో పాటు అభిమానుల నినాదాలు వినపడుతున్నాయి. జూ.ఎన్టీఆర్ వస్తేనే పార్టీ నిలబడతాది అనేద వారి వాదన. ఇటీవల కాలంలో ఈ డిమాండ్ ఎక్కువైంది. అతడు పార్టీలోకి తప్పక రావాలంటూ టీడీపీ అభిమానులు పట్టుబడుతున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇప్పుడు వచ్చినా ఉపయోగం లేదని చెప్పారు.ఇప్పటికే ఆలస్యమయిందని.. జూ.ఎన్టీఆర్ ఇప్పుడు వస్తే ఐదేళ్ల తర్వాత అవకాశం ఉంటుందన్నారు. అది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిలా ప్రజల్లో ఉండాలని సూచించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని లక్ష్మీపార్వతీ జోష్యం చెప్పారు. లోకేష్ లో నాయకత్వ లక్షణాలు లేవని..అతడు చేపట్టిన యువగళం పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శించారు.