Home > Featured > పాఠశాలనే ఇంటిగా మార్చిన వైసీపీ నేత.. ‘నాడు నేడు’ అంటే ఇదే

పాఠశాలనే ఇంటిగా మార్చిన వైసీపీ నేత.. ‘నాడు నేడు’ అంటే ఇదే

YCP leader occupied the school building in panyam

ఓ వైపు సీఎం జగన్ పాతబడిపోయిన పాఠశాలలను బాగు చేయడానికి నాడు నేడు కార్యక్రమం చేపడుతుంటే వైసీపీకి చెందిన పార్టీ నాయకుడు మాత్రం పాఠశాల భవనాన్ని ఆక్రమించి ఏకంగా ఇంటి కింద మార్చేశాడు. నంద్యాల జిల్లా పాణ్యం పట్టణంలోని ఇందిరానగర్‌లో జరిగిందీ ఈ ఘటన. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కబ్జా వివరాలు ఇలా ఉన్నాయి. 2013 జూన్‌లో రాజీవ్ విద్యా మిషన్ నిధుల కింద రూ . 5.30 లక్షలతో ప్రభుత్వం పాఠశాలను నిర్మించింది.

అయితే విద్యార్ధుల సంఖ్య పడిపోవడంతో ఐదేళ్ల క్రితం పాఠశాలను మూసేశారు. అప్పుడు ఆక్రమించుకున్న స్థానిక వైసీపీ నేత పాఠశాల శిలాఫలకం, బోర్డు తొలగించి రెండు బెడ్రూంలు, కిచెన్, హాలు, బాత్రూంలు, మెట్లు నిర్మించుకున్నారు. స్థానిక సర్పంచ్ బంధువులే ఈ పని చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మండల విద్యాధికారిని కలిసి వివరణ కోరగా.. భవనాన్ని ఆక్రమించింది ఎవరో తెలియదన్నారు. తమ దృష్టికి ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే తాళాలు వేస్తామని తెలిపారు. తర్వాత భవనానికి తాళాలు వేయించారు. కాగా, ఈ ఘటనపై టీడీపీ నేతలు స్పందిస్తూ.. నాడు - నేడు అంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పని ఇదీ అని విమర్శిస్తున్నారు.

Updated : 10 Sep 2022 4:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top