వైసీపీలోవిభేదాలు..తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడికి యత్నం  - MicTv.in - Telugu News
mictv telugu

వైసీపీలోవిభేదాలు..తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడికి యత్నం 

February 20, 2020

fcgvb

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి.కొంత కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న భేదాభిప్రాయాలు ఏకంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎదురుగానే నేతలు కొట్టుకున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ నినాదాలు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వేణు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మధ్య ఉన్న ఈ విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఓ వ్యక్తి ఏకంగా చెప్పుతో దాడి చేసేందుకు రావడంతో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. 

ద్రాక్షారామం భీమేశ్వరాలయానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైవీ సుబ్బారెడ్డితో పాటు తోట త్రిమూర్తులు కూడా వెళ్లారు. ఈ క్రమంలో తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరేందుకు సభను ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే స్థానిక ఎమ్మెల్యే వేణు వర్గానికి చెందిన ఇజ్రాయెల్ అనే వ్యక్తి ఏకంగా తోట త్రిమూర్తులుపైకి చెప్పుతో దాడి చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు అది తగలేదు. ఈ ఘటనపై త్రిమూర్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు అక్కడే ఉన్న మంత్రి మోపిదేవి వెంకటరమణ తోట త్రిమూర్తులును సముదాయించారు. ఇజ్రాయెల్ గంగవరం మండలం మసకపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.