అక్రమ తవ్వకాలు... చూడ్డానికి వెళ్లిన టీడీపీ నేత కారుపై దాడి - MicTv.in - Telugu News
mictv telugu

అక్రమ తవ్వకాలు… చూడ్డానికి వెళ్లిన టీడీపీ నేత కారుపై దాడి

June 13, 2022

గుంటూరు జిల్లా పెదకాకానీ మండలం, అనుమర్లపూడిలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. మట్టి తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కారుపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ.. వీడియో తీయనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో వారు ఘర్షణకు దిగారు. ధూళిపాళ్లకు వ్యతిరేకంగా గోబ్యాక్ న‌రేంద్ర, డౌన్ డౌన్ నరేంద్ర అంటూ నినాదాలు చేశారు.

దీనిపై మాజీ ఎమ్మెల్యే నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలను ప్రశ్నిస్తే మీకేందుకు భయం అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ప్రశ్నించారు. అనుమర్లపూడి మాత్రమే కాకుండా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో క్వారీ, వ‌డ్లమూడి, సంగంజాగ‌ర్లమూడి, చేబ్రోలు త‌దిత‌ర ప్రాంతాల్లోనూ వైసీపీ నేతలు అక్రమంగా మ‌ట్టి త‌వ్వకాలు జ‌రుపుతున్నార‌ని, దీనివ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణ స‌మతుల్యత దెబ్బతింటోంద‌ని ఆయన ఆరోపించారు.